నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న అధ్యక్షతన తెలుగు సముదాయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు చెందిన తెలుగు భాషోపాధ్యాయులు 26 మంది పాల్గొన్నారు. వీరికి విద్యాశాఖ సూచనల మేరకు ఎన్ ఏఎస్-2024 పై తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నేషనల్ అచివ్ మెంట్ సర్వే 2024లో భాగంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల 3, 6, 9 తరగతుల విద్యార్థులకు నవంబర్ లో నిర్వహించే జాతీయ సాధన సర్వే 2024 పరీక్షకు సిద్ధం చేయుటకు ఉపాధ్యాయులకు పలు సూచనలు, పరీక్ష విధానం పై అవగాహన కల్పించారు. సమావేశంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారి కే. గంగాధర్, ఆర్పీలు పుట్ట రాజేశ్వర్, వంగరి మధుసూదన్, మూడు మండలాల భాషోపాధ్యాయులు,ప్రాథమిక పాఠశాల ఆర్పీలు మారుతీ, అశోక్, శ్యామల, రాజు, తదితరులు పాల్గొన్నారు.