
ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ చేసిన 30 సంవత్సరాల నిరంతర పోరాటం నెరవేరిందని మండల ఎమ్మార్పీఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదాలు తెలపడంతో శనివారం భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బస్టాండు నుండి బడా భీంగల్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నిరంతరం పోరాటం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులకు బాసటగా ఉంటూ అనుకున్నది సాధించేవరకు కృషి చేశాడని కనుక ఆయన అడుగుజాడల్లోనే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.