తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 రోజుల స్వచ్ఛధనం-పచ్చధనం కార్యక్రమాన్నిమండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. నేటి నుండి 9వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్ లోచెత్తన తొలగించిమురుగునీరునిల్వఉండకుండాచర్యలు తీసుకోవాలన్నారు. అధికారులుసీజనల్ వ్యాధులు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, త్రాగునీరు కలుషితం కాకుండాచర్యలుచేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు.అంతే కాకుండా ప్లాస్టిక్ వాడకంతో జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహనకల్పించాలి అన్నారు.పాఠశాల,అంగన్వాడి కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టిప్రజా ప్రతినిధులతో యువకులు స్థానిక ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. వన మహోత్సవం ద్వారా ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శి లకు సూచించారు.మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛధనం – పచ్చధనం దోహదపడుతుందని అధికారులు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ్,మండల ప్రత్యేక అధికారి కిసాన్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,నాయకులు మహేందర్ రెడ్డి,చిప్ప మోహన్,కల్లూరి పండరీ,సంజీవ్, అంగన్వాడి టీచర్లు,గ్రామపంచాయతీ సిబ్బంది,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.