నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో వాటర్ ట్యాంకులను, ట్యాంకు పరిసరాలను శుభ్రం చేయిస్తున్న కార్యదర్శి సతీష్ చంద్ర . స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రం చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట అంగన్వాడీ కార్యకర్త గంగా జమున, కారోబార్ సాజిద్ , పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.