తాండాల్లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ

Excise Department conducted inspections in Thandaనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని పలు తండాల్లో పోలీసులు ఆబ్కారీ అధికారులు  గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు  ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గాంధారి మండలంలోని నేరేల్  తండా, చెద్మల్ తండ, బీర్మల్ తండ, కొత్త బాది తండా, గుజ్జుల్ తండా, సోమారం తండా, గొల్లాడి తండాల లో గల పంట పొలాలలో మరియు అడవి భూములలో దాదాపు 100 మంది సిబ్బందితో తనిఖీలు చేయడం జరిగినది. ఎవరైనా గంజాయి పండించిన, రవాణా చేసిన ఎవరి దగ్గరైనా ఉన్నా గాని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగలరని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ తనిఖీల్లో సదాశివనగర్ సిఐ  సంతోష్,  ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, సదాశివ నగర్ ఎస్సై రంజిత్, జిల్లా లోని పలువురు ఎస్సైలు  మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆబ్కారి శాఖకు చెందిన CI షాకీర్ , ఎస్సై గంగాధర్  మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
Spread the love