ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం

Geriatric Medical Camp under AYUSH Departmentనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామంలో మంగళవారం నాడు తెలంగాణా ప్రభుత్వము డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్  ఆదేశాల మేరకు… ప్రభుత్వ హోమియో పతి వైద్యశాల మద్నూర్ (కామారెడ్డి)  తరపున వృద్ధాప్య వైద్య శిభిరం ను డాక్టర్ మానస (హోమియోపతి, డాక్టర్ ఉమాదేవి (ఆయుర్వేద) ఆధ్వర్యంలో  నిర్వహించారు.  వృద్ధాప్య వైద్య శిబిరం లను అందరు ఉపయోగించు కోవాలని… దీర్ఘకాలిక వ్యాదులు. ఆస్తమా.. జ్వరాలు. వ్యాదులు. చర్మ వ్యాదులు. అర్శమొలు. అన్నిటికీ పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని డాక్టర్లు తెలిపారు. ఈ ఔషధాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, ఫార్మసిస్ట్ భార్గవి, ఎస్ ఎన్ ఓ మహేందర్, గ్రామ ఆరోగ్య రక్షణ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు, సుమారు 100 మందికి పైగా మందులు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ మానస తెలిపారు.
Spread the love