
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను డి.కృష్ణవేణి రూ.19,000 కే.చంద్రయ్య లకు రూ.60 వేల చొప్పున చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సీనియర్ నాయకులు పబ్బు రాజుగౌడ్ మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్న గోని అంజయ్యగౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ వెల్గ రాజశేఖర్ రెడ్డి,ఢిల్లీ శేఖర్ రెడ్డి,మాధగోని శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొర్పురి సైదులు,జండ్రు అంజిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.