నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి బుధవారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ శివారులోని బృందావనం లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల కిషన్ కుమారుడి వివాహం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అయన వేంట ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చంద్ నాయక్, మునిపల్లి సాయరెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల దాస్, సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అద్యక్షులు సంతోష్ రెడ్డి, పోలసని శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అదికారులు తదితరులు పాల్గొన్నారు.