భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియపై మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో సభ్యత్వ నమోదు ప్రక్రియపై కార్యశాలను మండల అధ్యక్షుడు జయసాగర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం పోలింగ్ బూతు కార్యకర్తలకు శక్తి కేంద్రం ఇంచార్జీలకు, మండల పదాధికారులు వివిధ మోర్చాల పదాధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రాథమిక సభ్యత్వం నమోదు చేయు విధానము అందుకు కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 8800002024 గురించి ఆన్లైన్ ద్వారా నమో యాప్ ద్వారా నమోదు గురించి సభ్యత్వ మండల కోఆర్డినేటర్ నల్ల రమేష్( జిల్లా కార్యదర్శి) సహా కోఆర్డినేటర్ మోరె సాయినాథ్ పటేల్ మహిళా మోర్చా నాయకురాలు హీనా ఫిర్టోస్ వివరించారు. సభ్యత్వ నమోదు కోసం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ ని అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సెప్టెంబర్ రెండవ తారీకున లాంచ్ చేస్తారని తర్వాత జిల్లా స్థాయిలో సెప్టెంబర్ మూడవ తారీకున సభ్యత్వాన్ని లాంచ్ చేస్తారని చెప్పారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ చిన్నారావు విశ్రాంత ఉపాధ్యాయులు సంటెన్న సార్ మాజీ సర్పంచ్ గంజాల గంగాధర్ ,మంద భాస్కర్ మాజీ ఎంపీటీసీ పోతన్న ,ఉపసర్పంచ్ ప్రవీణ్ ,మహిళా మోర్చా నాయకురాలు సరస్వతి & హీనా ఫిర్టోస్ పిఎసిఎస్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ,బీజేవైఎం మండల అధ్యక్షుడు మంద గణేష్, అసెంబ్లీ బీజేవైఎం జాయింట్ కన్వీనర్ శ్రీదర్ వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.