నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకొని ఈనెల 23 నుంచి 27 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మాజీ మేయర్, సొసైటీ చైర్మన్ డి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వినాయక నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోక్రీడా పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి మరణించిన తర్వాత తొలి జన్మదిన పురస్కరించుకొని క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈనెల 23 నుంచి 27 వరకు పాత కలెక్టర్ గ్రౌండ్ లో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా కబడ్డీ, కోకో, వాలీబాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులు టీం ఎంట్రీలను ఈనెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వాట్సాప్ నంబర్లకు పంపి ఎంట్రీస్ తీసుకోవాలన్నారు. క్రీడా పోటీల సందర్భంగా తొలి రోజు నిర్వహించే మార్చి ఫస్ట్, తోపాటు ప్రిన్సిపాల్ సంతకం స్టాంప్ తో గల వివరాలను రిసెప్షన్లో అందజేయాలని అప్పుడే టీం లకు ఎంట్రీస్ ఇస్తూ అర్హత సాధిస్తారని తెలిపారు.
23న ప్రారంభమయ్యే మార్చ్ ఫస్ట్ కు సకాలంలో హాజరుకావాలని మార్చి ఫాస్ట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 5000 రూపాయలు మొదటి బహుమతిగా, ద్వితీయ బహుమతిగా 2000 రూపాయల నగదు ఇవ్వబడునని తెలిపారు. క్రీడల్లో క్రీడాకారులకు మొదటి బహుమతిగా 10000 రూపాయలు, రెండవ బహుమతిగా 5000 రూపాయల ప్రోత్సాహక నగదును అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బాక్సింగ్లో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు 3000 రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు 2000 రూపాయలు నగదు బహుమతి అందిస్తామన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి షీల్డ్ నగదు బహుమతి వ్యక్తిగత బహుమతులను, అలాగే పలు క్రీడల్లో గెలుపొందిన వారికి ముగింపు రోజున కూడా బహుమతులు ప్రధానం చేయబోతుందన్నారు. ఈ క్రీడలు ప్రతి సంవత్సరం తమ తండ్రి పేరిట ఈ క్రీడలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా తమ నిర్వహించే ఈ క్రీడా పోటీలకు ప్రముఖ క్రీడాకారులు మలావత్ పూర్ణ, సౌమ్య, అసముద్దీన్ హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో పాటు అఫీషియల్ టీం అఫీషియల్ కూడా మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ధర్మపురి సంజయ్ 7774956789, డి సాయిలు 9848060999, విద్యాసాగర్ రెడ్డి 944066250 నంబర్లకు సంప్రదించాలన్నారు.క్రీడా పోటీల్లో సొసైటీ కోశాధికారి సంపత్, ప్రధాన కార్యదర్శి గౌతమ్, కార్యవర్గ సభ్యులుడి సురేందర్, పుప్పాలశోభ, డి సాయిలు తదితరులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.