మెను ప్రకారం భోజనం అందించాలి

Meals should be served as per the menu– విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి సారిచాలి..
– మండల ప్రత్యేక అధికారి యోహన్.
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి వసతి గృహంలో ప్రభుత్వ పాఠశాలలో మేను ప్రకారమే విద్యార్థులకు భోజనం,టీ, స్నాక్స్ అందించాలని,వసతి గృహంలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, వసతి గృహంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారి యేహన్ఆదేశించారు. శనివారం  మండలం లోని దర్మారం బీ గ్రామంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల, వసతి గృహం ను ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వివరాలను,మేను రిజిస్ట్రార్ ను ఉపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  వంట గదులను, పంట పాత్రలను తదితర వాటిని పరిశీలించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలను, సలహాలను అందజేశారు. వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రభాలే అవకాశం ఉండడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని మేను ప్రకారం ఎప్పటికప్పుడు భోజనాలను టిఫిన్ తదితర వాటిని అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలిపి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.ఎలాంటి నిర్లక్ష్యం వహించ వద్దని, ఉత్తమమైన విద్యా బోధన చేయించడానికి కృషి చేయాలని కోరారు.

Spread the love