ఏకాదశి సందర్భంగా బోర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులతో మరియు పెద్దలతో కలిసి కాల్వ నరసింహ స్వామి వారిని దర్శించుకొని అక్కడ నుండి నేరుగా (కదిలి పాపహరేశ్వర లింగం) స్వామి నీ దర్శనం చేసుకున్నారు. మరియు కల్లూరు సాయిబాబా,కోరాడి గణపతిని దర్శించుకున్నారు. యూత్ సభ్యులందరూ కలిసి పాలాజ్ (చెక్క)గణపతి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ; గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం లో ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని గణనాథుని వేడుకుంటున్నామని తెలిపారు. యూత్ తరఫున ఈ దేవాలయాలను దర్శించుకున్నందుకు సంతోషకరంగా ఉందని యూత్ సభ్యులు తెలిపారు. ఈ తీర్థయాత్రలో నీలం రవి, బోధిరే తిరుపతి, పురస్తు లింబాద్రి, సుమన్, తరుణ్ నరేష్ ,లింబాద్రి ,ప్రవీణ్, నరేష్ ,హరీష్ రఘు, శ్రీకాంత్, నవీన్, సుఖేష్, వినేష్ సతీష్, వివేక్ ,రాజు, అజయ్ ,బన్నీ, ప్రణీత్, శీను ,వికాస్, రమేష్, హనుమంతు, స్వామి, శ్రీనివాస్, లింబాద్రి, గంగాధర్ పాల్గొన్నారు.