నవతెలంగాణ- కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎఫ్ ఆఫీస్ ఏరియా రోటరీ నగర్ నందు గల సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, గురుకుల పాఠశాల అనాధ పిల్లల హాస్టల్ ను ఆదివారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్శనలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్, ఉపాధ్యక్షులు నలవాల నరసయ్య, కెవిపిఎస్ సభ్యులు సతీష్ సాంపెల్లి ఉన్నారు. ఈ సందర్భంగా మొదట అనాధ పిల్లల హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి, పిల్లలను కనుక్కొని వారి యొక్క బాగోగులు తెలుసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులు తినేటువంటి మెనూ ప్రకారము పౌష్టికారాన్ని ప్రభుత్వం అందించడం లేదు, మరుగుదొడ్లు అద్వాన స్థితిలో ఒక డోరు కూడా లేని పరిస్థితి పిల్లలు నిద్రించే స్థలము కింద పడుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు అని తెలిపారు. వర్షాకాలము పాములు పేర్లు వచ్చే అవకాశం ఉన్నందున వారికి సరిపడా మంచాలు లేనందున వాటిని సరి అయిన పద్ధతిలో సరఫరా చేయాలి. బెడ్లు చలికి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కిటికీలకు జాలీలు లేవు. అదే విధంగా బీసీ హాస్టల్ కూడా సందర్శించడం జరిగింది. 130 విద్యార్థులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ వారికి ప్రైవేటు ఆటోను పాఠశాల వరకు తల్లిదండ్రులు చార్జీలు భరిస్తూ ఒక్కోవడానికి 300 నెలకు చొప్పున భరిస్తా ఉన్నారు అని తెలియజేశారు. ఇది ప్రభుత్వమే భరించవలసిన అవసరం ఉన్నది అని డిమాండ్ చేశారు. వాళ్ళకి ఇచ్చేటువంటి పౌష్టికారము సరైనటువంటి పదార్థాలు లేకపోవడం మరుగుదొడ్లు కూడా ఒకదాని కూడా శుభ్రత లేకపోవడం వాటి వలన అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుత ఈ కాలంలో దోమ కాటు వలన అనారోగ్యము దోమతోటే రావడం జరుగుతున్నది కాబట్టి వాటిని తక్షణమే డోర్లు రిపేరు చేస్తూ కొత్త డోర్లు ఎక్కించాలని ఆట స్థలానికి సంబంధించినటువంటిది వాటికి ఆట వస్తువులు సరి అయిన లేవు. పైన అంతస్తు ఖాళీ స్లాబే శిక్ష పెట్టి తప్ప మిగతా పని పూర్తి కాలేదు. గదుల నిర్మాణం కూడా చేయలేరని అంటున్నారు.కావున సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి చిన్నారులకు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. లేని యెడల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించే వరకు ఊరుకునేదే లేదన్నారు.