
ప్రభుత్వ శాఖల అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని పకడిబందిగా విధులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సాంగ్వన్ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శనివారం నాడు మద్నూర్ మండల లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల సందర్శించి తనిఖీ చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి దవఖానాలు వైద్యులు వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆ తర్వాత మన రాష్ట్ర సరిహద్దు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని పకడిబందీగా విధులు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర సరిహద్దులో నిఘా కట్టుదిట్టం చేయాలని సరిహద్దు చెక్‌పోస్టు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సందర్శనలో మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ ఆర్ఐ శంకర్ ఇన్చార్జి ఎంపీడీవో మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.