నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎల్లమ్మగుట్ట రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ప్రాంతంలో గత అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. సలంద్ర రాములు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి 2 గంటలకు ఎవరూ లేని సమయంలో ఒక యువకుడు ఇంటి లోపలికి చొరబడి, రాడ్డు సహాయంతో ఇంటికి వేసిన తాలాన్ని పగలగొట్టాడు. ఇంటి లోపల ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారం దొంగతనం చేసినట్టుగా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సదరు బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నాలుగవ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థలంలో సందర్శించి విచారణ మొదలుపెట్టారు. బాధితుడు సలంద్ర రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.