మత్స్యకారులకు ప్రభుత్వ చేయూత 

Government support to fishermen– అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట్ర ఆగ్రోస్ సమస్తా చైర్మన్ కాసుల బాలరాజ్ తెలిపారు. శనివారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ , తిర్మాలపూర్ గ్రామ చెరువులో ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న చేప పిల్లలను వదిలారు. ఇందులో తాడ్కోల్  గ్రామ ఊర చెరువుకు 58 వేలు, తిర్మాలపూర్ గ్రామంలో ఉన్న రెండు ఊర చెరువుకు 45 వేల చేప పిల్లల విత్తనాలను నేడు పంపిణీ చేసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం  ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని సూచించారు. అలాగే మత్స్య శాఖ అధికారి డోల్ సింగ్ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, తిర్మలాపూర్ తడకొల్ గ్రామాలకు ఉచిత చేప పిల్లల పంపిణీ పంపిణీ చేయడం జరిగిందని అలాగే  పంపిణీ చేయడం జరిగిందని అలాగే బాన్సువాడ ఊర చెరువుకు 75 వేల చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉందని త్వరలో పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేక్, మాజీ జడ్పిటిసి గోపాల్ రెడ్డి, విండో అధ్యక్షులు గంగుల గంగారం, బాన్సువాడ నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు మధు సూధన్ రెడ్డి, హన్మాండ్లు, మాజీ సర్పంచ్ రాజు, రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బోయ సంగం తదితరులు పాల్గోన్నారు.
Spread the love