విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన ఆర్కిడ్స్ పాఠశాల చైర్మన్

Chairman of Orchids School who gave encouragement to the studentsనవతెలంగాణ –  కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  ఆర్కిడ్స్ పాఠశాలలో మంగళవారం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నగతు ప్రోత్సాహన్ని పాఠశాల ప్రిన్సిపాల్, చైర్మన్ గోవర్ధన్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులకు ఒకసారి ఒక క్లాస్ ను సందర్శించి ఆ క్లాసులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను గుర్తించి  వారికి నగాదు ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని, దీని ద్వారా తోటి విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి, విద్యను అభ్యసించడంలో చురుకుదనం ప్రదర్శిస్తారని  అన్నారు. మంగళవారం ఐదవ తరగతి  పికాక్ సేక్షన్ ను సందర్శించి అందులో తాను అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పిన రిషి, అమూల్యాలకు నగదు ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందన్నారు.
Spread the love