స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని అండర్ 17, అండర్ 14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నాపల్లి విద్యార్థులు ఎంపికయ్యారని పిడి రాజ్ కుమార్ మంగళవారం తెలిపారు. అండర్ 17 విభాగంలో 9వ తరగతి చదువుతున్న శ్రీనివాస్, వీరేష్, ఎంపికయ్యారు. అండర్ 14 విభాగంలో 8వ తరగతి సాయి కిరణ్, శ్రీరామ్, భవ్య శ్రీ ఎంపికయ్యారు. ఈ క్రీడా పోటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాదాపూర్ లో ఈ నెల 7 నుంచి 10 వరకు నిర్వహించా నున్నారు. ఎంపికైన క్రీడాకారులను మండల విద్యాధికారి శ్రీధర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు నాగరాజు,వీడిసి చైర్మన్ అశోక్ విడిసి సభ్యులు,మాజీ సర్పంచ్ తెలు విజయ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్,ఉపాధ్యాయ బృందం, గ్రామ యువజన సంఘాలు, గ్రామస్తులు అభినందించారు.