
మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా చూడాలని మెడికల్ అధికారి దివ్య తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో అంటూ ఆడపిల్లల యొక్క ఆవశ్యకతను వారి యొక్క ప్రాముఖ్యతను వివరించాలని, ఎవరు కూడా తమ పరిధిలో ఆడపిల్లలు ఉన్నారని గర్భవిచ్చితి చేసుకోకుండా చూడాలని ఆశాలకు సూచించారు. యువత మత్తు పదార్థాల బానిస కాకుండా అవగాహన కల్పించాలని, టొబాకో ఫ్రీ స్కూల్ అంటే పాఠశాల పరిధిలో చుట్టుపక్కల ఎక్కడ కూడా బీడీ సిగరెట్లు గంజాయి మొదలైనవి అమ్మకుండా చూడాలని, విద్యార్థులు వాటికి అలవాటు పడకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం అందజేసే రిజిస్టర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఉన్నారు.