మండలం లోని కుకునూరు గ్రామవాసి ర్యాడ చిన్న గంగారాం, ఇటీవల గుండె ఆపరేషన్ కాగా సోమవారం ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించినారు. చిన్న గంగారాం కొడుకు అబుదాబిలో ఉండగా,. తండ్రికి సహాయ పడాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన కోటపాటి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించి, గుండెకు సంబంధించిన ఆపరేషన్ కొరకు బాల్కొండ యం.ఎల్.ఏ వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ” రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ స్కీమ్ నుండి గుండె ఆపరేషన్ కు సంబంధించి పూర్తి ఖర్చులు మంజూరు చేయించారు. పరామర్శించిన వారిలో , మాజీ సర్పంచ్ లింబాద్రి , దుర్గేన రాము, రంజిత్ కుమార్, ప్రేమ్, రఘు తదితరులు ఉన్నారు.