నవతెలంగాణ – కంటేశ్వర్
జన విజ్ఞాన వేదిక ,తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 12,13 తేదీల్లో నిజామాబాద్ బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అని అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, ప్రధాన కార్యదర్శి నర్రా రామారావు, కోశాధికారి కే రామ్మోహన్రావు సోమవారం ప్రకటనలో తెలిపారు.డాక్టర్లు,సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, సమాజ హితులు, తదితరుల అందరు సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇది పిల్లల పండుగ చదువుల పండుగ చాచా నెహ్రూ ప్రాంగణం ప్రెసిడెన్సీ స్కూల్ మోపాల గ్రామంలో ఈ వేడుక జరుగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు కదిలేందుకు ఈ బాలోత్సవం ఉపయోగపడుతుందనే భావంతో నిజామాబాదులో నిర్వహించేందుకు ముందుకు వచ్చాము. దాదాపుగా 3,000 మంది బాల, బాలికలు హాజరవుతారనే అంచనాతో ఉన్నాము.ఈ బాల,బాలికలను అభినందించేందుకు, వారి యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ, మీకు హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము.12వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.