పట్టణానికి చెందిన సామాజిక సేవకులు.పట్వారీ తులసి కుమార్ సేవలు నేటి యువతరంకి ఆదర్శం అని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, ఎల్ కె హాస్పిటల్ వైద్యులు అశోక్ అన్నారు. జాతీయ స్థాయిలో భారత సేవ రత్న పురస్కారం అందుకున్న సందర్భంగా శనివారం హాస్పిటల్ బృందంతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరలుగా సమాజం లో సేవలు అందిస్తూ ఆర్మూర్ కే గొప్ప స్పూర్తి దాయకం గా సేవలు అందించడం ,తులసి నీ గుర్తించి జాతీయస్థాయి లో పురస్కారం రావడం, గర్వ కారణం అని అన్నారు.. ఈ కార్యక్రమం లో రాజన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు.