హత్యాయత్నం కేసులో వ్యక్తికి కఠిన జైలుశిక్ష..

నవతెలంగాణ- కంటేశ్వర్
ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ముద్దాయి సయ్యద్ ఇక్రముద్దీన్ కు నాలుగేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీకాంత్ బాబు శుక్రవారం తీర్పు చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి నర్సయ్య తెలిపిన వివరాలు.. నిజామాబాద్ నగరంలోని హస్మి కాలోనికి చెందిన సయ్యద్ ఇక్రముద్ధిన్ మధ్యం సేవిద్దామని రైల్వే స్టేషన్ దగ్గర గల టానిక్ వైన్స్ పర్మిట్ రూమ్ లోకి వెళ్ళాడు. అప్పయికే అక్కడ మద్యం సేవిస్తున్న బాలాజీ సంగ్రామ్, షేక్ ఆమేర్ లను మద్యం పోయమని అడిగాడు. మాకే సరిపోదు నువ్వెవరు మమ్మల్ని అడుగుతున్నావు అని ప్రశ్నించడంతో చంపివేయాలనే ఉద్దేశ్యంతో తన జేబులోంచి బ్లేడ్ తీసి ఆమేర్ పై దాడిచేసి గొంతుపై కోసి తీవ్రంగా గాయపరచడనే అభియోగం కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినాయి. భారత శిక్షాస్కృతి సెక్షన్ 307 హత్యాయత్నం కేసు రణువువైనట్లు నిర్ధారిస్తు ఇక్రముద్దీన్ కు నాలుగు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని ఎడల అదనంగా రెండు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జడ్జి శ్రీకాంత్ బాబు తమ తీర్పులో పేర్కొన్నారు.
Spread the love