- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మారుతి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మార్వో మారుతి ఎగురవేసి పోలీసు వందనం స్వీకరించారు. అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు అధికారులు నాయకులు ఆహ్వానించి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ హేమలత , గిర్ధావర్ రామ్ పటేల్ , కాంగ్రెస్ , బిజెపి , బీఆర్ఎస్, మరియు వివిధ పార్టీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది , కామదారులు , విద్యార్థులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -