
కోహెడ మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను కేటాయించాలంటూ ఆదివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామ యువత ఆధ్వర్యంలో సుమారు మూడు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని, ఏదైనా అత్యవసరమైతే బెజ్జంకి నుండి ఆంబులెన్స్‌కు కాల్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాలలో అనుకున్న పరిస్థితులలో ఆంబులెన్స్ రాకపోవడంతో ఎప్పటికే ఎన్నో జరగరాని ప్రమాదాలు జరిగాయాన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆంబులెన్స్‌ను కోహెడకు కేటాయించాలని పేర్కోన్నారు. రానున్న రోజులలో ఇదే జరిగితే ఎన్నో ప్రమాదాలకు అనుకున్న పరిస్థితులలో ఆంబులెన్స్ అందకపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన మండల అధికారులు, నాయకులు స్పందించి కోహెడ మండల కేంద్రంలో ఆంబులెన్స్ ఏర్పాటుకు సహాకరించాలని వారు కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాతో మూడు గంటలకు పైగా రాకపోకలకు పలు ఇబ్బందులకు ప్రయాణికులు ఎదుర్కోన్నారు. దీంతో ఎస్సై నరేందర్‌రెడ్డి జోక్యంతో సమస్య సద్దుమణిగింది.