- Advertisement -
– వరంగల్ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
నవతెలంగాణ – కాశిబుగ్గ
వరంగల్ రైల్వే స్టేషన్‌లో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు రివర్స్ వస్తున్న క్రమంలో ఏటీఎం పక్కన ప్రహరీ గోడకు తగలడంతో గోడ ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
- Advertisement -