- Advertisement -
నవతెలంగాణ నల్గొండ టౌన్: ఈనెల 29, 30 తేదీలలో నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వారి బృందం సభ్యులు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఎర్రబెల్లి గ్రామంలో నల్గొండ ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి కే.సుభాషిణి తోటలను, రూట్ ను పరిశీలించారు. అదేవిధంగా తోటలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షుడు సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి ఆర్టికల్చర్ అధికారులు మురళి, రిషికలు పాల్గొన్నారు.
- Advertisement -