
ఇళ్ళు లేని నిరు పేదలు అందరికి ఇండ్లు ఇవ్వాలి అని బుధవారం స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ కు ఊరటం గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కు గ్రామం మొత్తం వరదల్లో మునిగిపోయింది అని ఆవేదన చెందారు. అలాగే నష్టపోయినా పేదల కు ట్రైబల్ రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి అని, ఇటీవలే కలెక్టర్ మంజూరు చేసిన గ్రామపంచాయతీ మరియు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మంజూరు చేసిన కమ్యూనిటీ హల్ కొరకు గ్రామ కంఠం భూమి ఉంది అని సర్వే చేసి గ్రామస్తులకు ఒప్పచెప్పాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు చేర్ప రవీందర్, చేర్ప చంద్ర శేఖర్, చేర్ప నేతాజీ, కోటే నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.