మణిపూర్ ఘటనకు నిరసనగా శాంతియుత ర్యాలీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
మణిపూర్ లో జరుగుతున్న హింసకాండ మారణ హోమం మహిళలపై దాడులు ఆపాలని కోరుతూ ఈనెల 18న మండలంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సిస్టర్ మరియా మన్మధ తెలిపారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో మీడియాతో సిస్టర్ మరియా మన్మధ మాట్లాడారు. మణిపూర్ లో కుక్కి గిరిజన మహిళల నగ్న ఊరేగింపు సామూహిక అత్యాచారాలను నిరసిస్తూ ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. మండల మహిళా సంఘాలు ఐక్య క్రైస్తవ సంఘాలు సిఆర్ఐ సంఘాలు మానవతావాద ప్రజా సంఘాలు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ శాంతిరాలిని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరు ర్యాలీలో పాల్గొని మణిపూర్ ఘటనపై తమ నిరసన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ 18న ఉదయం 9 గంటలకు మండలంలోని పసర సెయింట్ మేరీస్ పాఠశాల నుండి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ యాక్టివిటీస్ కోఆర్డినేటర్ నిమ్మగడ్డ మహేశ్వరి పాల్గొన్నారు.

Spread the love