టియు డబ్ల్యూ జె జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్ ఎన్నిక

నవతెలంగాణ- ఆర్మూర్ 
జిల్లా కేంద్రంలోని ఇటీవల జరిగిన టియుడబ్ల్యూజే (ఐజేయు) ఎన్నికలలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పార్ధేం సంజీవ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్, ప్రధాన కార్యదర్శి లిక్కి శ్రావణ్ కుమార్, సలహాదారుడు గణేష్ గౌడ్ లు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంజీవ్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందించారు. సంజీవ్ మాట్లాడుతూ విలేకరులకు సమస్యలు ఎదురైతే జిల్లా కమిటీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తానని చెప్పారు. విలేకరులందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మంచిర్యాల నరేందర్, అమృత శ్రావణ్, విన్సెంట్, గోజూరి మహిపాల్, వెంకటేష్ గుప్తా, షికారి శ్రీనివాస్, బారడ్ గణేష్, సామ సురేష్, ముఖేష్, గట్టడి అరుణ్, రాజేందర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love