డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన నాయకులు

నవతెలంగాణ – ఆర్మూర్   

బిజెపి పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ ఆధ్వర్యంలో గురువారం పట్టణం లో గల 1300 ప్లాట్ లలో కట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడుతూ.. పట్టణంలో గల 1300 ప్లాట్ లలో ఎమ్మెల్యే   డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు కేవలం 160 కట్టి వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు లబ్ధిదారుల అప్లికేషన్లు 600 పైతీలుకు అయితే కేవలం 160 కట్టి ఆశ చూపించి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటిని కూడా ఈ ఎలక్షన్ల ముందు పంచకుండా ఎన్నికల లక్ష్యంగా వాటిని చూపిస్తూ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే ఇందులో వచ్చే డబుల్ బెడ్ రూమ్ నీకు ఇవ్వను అని బెదిరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడు ఈ రౌడీ రాజకీయం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి ఈ ఎమ్మెల్యే గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుందో స్థలం ఉన్న వారికే ఇస్తా అని అప్లికేషన్ గడువును కేవలం మూడు రోజులతో సరిపెట్టి ఏదైతే బీద ప్రజలు ఉన్నారో వారికి స్థలాలు కూడా లేవు మరి వారి సంగతేంటి అని అడిగితే ఇంతవరకు జవాబు లేదు దాటి వేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వలేదు మరి ఇప్పుడు వారు ఎలా అప్లై చేసుకుంటారని సూటిగా ప్రశ్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు కావున స్థలం లేని వారికి వెంటనే ఆరు లక్షల రూపాయలు కేటాయించి వారికి ఇల్లు కట్టుకునే విధంగా స్థలములు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఇంకా మీరు ఉండేది మూడు నెలలు మాత్రమే ఈ పేద ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారు  అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శీను, ఆరే రాజేశ్వర్, కార్యదర్శి పులి యుగేందర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కౌన్సిలర్ సాయి, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు శేషగిరి లింగం, పట్టణ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఉదయ్  కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love