- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఎం.నాగయ్య టీచర్ విధులు ఉత్తమమని మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అన్నారు. పెద్ద ఎక్లారా ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఎం నాగయ్య జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సందర్భంగా ఆ గ్రామ నివాసుడు మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ బుధవారం పాఠశాల లో ఉత్తమ ఉపాధ్యాయునికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -