– ఆలస్యంగా వెలుగులోకోచ్చిన ఘటన
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పరిధిలోని ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల యువకుడు అత్యాచారం కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. బడా బజార్ కు సమీపంలో గల ఓ గల్లీలో ఐదున్నర ఏళ్ల చిన్నారిపై అదే కాలనీలో నివాసం ఉంటున్న 40 ఏళ్ల ఓ మేకల కాపరి వీధిలో ఆట ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి ఈ దారుణ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. గురువారం చిన్నారి కడుపునొప్పి ఉందని తెలపడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. వెంటనే కుటుంబ సభ్యులు రెండవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆ నోట ఈ నోట బయటకు పోక్కడంతో విషయం బయటకోచిన్నట్టు తెలిసింది. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుడి పై ఫోక్సో చట్టం కింద కేసును నమోదు చేసినట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము తెలిపారు. పోక్సో కేసుల కన్నా కఠినంగా శిక్షిస్తే గాని అభం శుభం తెలియని చిన్నారులు కామాంధుల భారిన పడకుండా ఉంటారని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.