– వెల్లివెరిసేలా నవరాత్రి ఉత్సవాలు
– బీఆర్‌ఎస్ నేత డిపి రెడ్డి
హైదరాబాద్: గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు విఘ్నేశ్వరుడని అంబర్‌పేట్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రులను ప్రజలు సుఖశాంతులతో నిర్విఘ్నంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం అంబర్‌పేట్‌కు చెందిన మహంకాళి యంగ్ మెన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం గణనాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరిసేలా వినాయక చవితి నవరాత్రులను ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని కోరారు. గణనాథుడి ఆశీస్సులతో సర్వ విఘ్నాలు వైదొలగి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రులతో పాటుగా నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ గౌడ్, రాజేష్, దీపక్, నర్సింగ్ రావు, శంకర్ గౌడ్, సన్ని, శశి, కృష్ణ, రోహిత్‌రాజ్, నరేష్, విఘ్నేష్, సునిత్ తదితరులు పాల్గొన్నారు.