నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్ సమీపంలో బెల్ట్ షాపు కొనసాగుతున్నట్లు పక్క సమాచారం మేరకు బిచ్కుంద ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి బీర్లు లిక్కర్లు పట్టుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ బెల్ట్ షాపులు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగేష్ కానిస్టేబుల్ శ్రీధర్ ప్రేమలత దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.