నిత్యవసర వస్తువుల చట్టం కింద రెంజల్ సొసైటీ పై కేసు నమోదు

– మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి..

నవతెలంగాణ – రెంజల్
నిత్యవసర వస్తువుల చట్టం కింద రెంజల్ సొసైటీ పై కేసు నమోదు చేసినట్లు రెంజల్ వ్యవసాయ అధికారి లక్ష్మీకాత్ రెడ్డి స్పష్టం చేశారు. నిత్యవసర వస్తువుల చట్టం, ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ కింద కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్కు నివేదికను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈవో పి ఓ ఎస్ మిషన్ ద్వారా ఎరువుల విక్రయాలు జరపడం లేదని, ఈవో పీవోఎస్ మిషన్ స్టాక్ కి, గ్రౌండ్ స్టాక్ కి వ్యత్యాసము ఉన్నందున, క్యాష్ క్రెడిట్ బిల్లు రైతులకు ఇవ్వకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందున ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రెంజల్ సొసైటీ పరిధిలోని రెంజల్, సాటాపూర్, సాడ్ బిలోలి గ్రామాలలో రైతుల సౌకర్యార్థం వచ్చినటువంటి స్టాకును అందుబాటులో ఉంచడం వల్ల ఈవో పీవోఎస్ మిషన్ కి, గ్రౌండ్ స్టాక్ వ్యత్యాసం ఉన్నట్లు కనబడుతోంది తప్ప తాము ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదని సొసైటీ కార్యదర్శి రాము తెలిపారు. తమ సొసైటీ కి వచ్చినటువంటి స్టాకును ఈ మూడు ప్రదేశాలలో రైతుల సౌకర్యార్థం ఉంచడం జరిగింది తప్ప, అందులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్టాకు విషయంలో సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం జరిగేలా చూడాలని సొసైటీ కార్యదర్శి రాము కోరుతున్నారు.
Spread the love