యువత మెదళ్లలో కాషాయం నింపే కుట్ర

In the minds of youth Conspiracy to fill amber– ఎన్‌సీఆర్‌టీ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత
– ఆ నిర్ణయం తగదన్న సీపీఐ(ఎం), కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : పాఠశాల టెక్ట్స్‌ పుస్తకాల్లో ఇండియా పేరును భారత్‌గా ఉపయోగించాలన్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరిస్తుందని సీపీఐ(ఎం) పేర్కొంది. కేరళ సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సిలబస్‌ను అనుసరించే పాఠశాలలు ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను అడ్డుకుంటాయని అన్నారు. సైన్స్‌, వాస్తవ చరిత్రను వ్యతిరేకించే సంఫ్‌ు పరివార్‌ భారత దేశ గతాన్ని మార్చి యువతరం మెదళ్లలోకి చొప్పించాలని యత్నిస్తోందని అన్నారు. కేరళలోని పాఠశాల పాఠ్యపుస్తకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో సూచించిన విధంగా దేశం పేరును ఇండియాగా పేర్కొంటాయి. సంఫ్‌ు పరివార్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ” డార్విన్‌ పరిణామ సిద్దాంతం, మొఘలుల చరిత్ర, మహాత్మాగాంధీ జీవితం, హత్య” అధ్యాయాలను పాఠ్యపుస్తకాలలో కొనసాగిస్తాయని పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటవుతున్న ప్రతిపక్షాలు తమ వేదికకు ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా)గా పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఆగ్రహంతో పాఠ్యపుస్తకాలు, అధికారిక ఆహ్వానాలు, ఇతర ప్రభుత్వ అంశాలలో దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్‌గా ముద్రిస్తోందని అన్నారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని కూడా కేంద్రం తిప్పికొట్టిందని అన్నారు. ఇండియా, భారత్‌ చర్చలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) కూడా ఒకే పక్షంలో నిలిచాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.సి. వేణుగోపాల్‌ కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ చరిత్రను వక్రీకరించేందుకు యత్నిస్తోందని అన్నారు. కర్నాటకలోని కాంగ్రెస్‌, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాలు కూడా ఎన్‌సీఈఆర్‌టీి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. సీపీఐ(ఎం) కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జాబితాలో విద్య అంశాన్ని చేర్చడంతో ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను వ్యతిరేకించడానికి లేదా ఆమోదించడానికి రాష్ట్రాలను అనుమతిస్తుంది.

Spread the love