నేడు అవిశ్వాసంపై ఓటింగ్‌

Today on unbelief Votingప్రధాని మోడీ హాజరయ్యేనా?
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు (గురువారం) ఓటింగ్‌ జరగనుంది. పార్లమెంట్‌కు రాకుండా ఉన్న ప్రధాని మోడీని సభకు రప్పించి, మాట్లాడించడా నికి ఒక సాధనమే ఈ అవిశ్వాస తీర్మానమని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. అది నేడు నెరవేరనుంది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ నేడు సమాధానం ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఈ తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో నేడు అవిశ్వాసంపై ఓటింగ్‌..ఎలాగూ ప్రభుత్వమే గెలుస్తుందని అందరికీ తెలుసు. అయితే ప్రస్తుత లోక్‌సభ అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వానికి మద్దతుగా 369, ప్రతిపక్షానికి మద్దతుగా 154, తటస్థంగా 16 మంది మద్దతు ఉంది.
మణిపూర్‌లో శాంతి నెలకొల్పుదాం :కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా తీర్మానం
మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం లోక్‌సభలో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాలు ప్రధాని మోడీ సమక్షంలో తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేశాయి. వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జోక్యం చేసుకొని ప్రధాని మోడీ గురువారం సభలో మాట్లాడతారని అన్నారు. అయితే అప్పుడే తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. కానీ స్పీకర్‌ ఓం బిర్లా తీర్మానం పెట్టడంపై సమ్మతించే వారు చేతులెత్తండని పేర్కొన్నారు. దీంతో అధికార సభ్యులంతా చేతులెత్తి తీర్మానానికి మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాల హౌరెత్తించారు. ప్రధాని మోడీ సభకు రావాలని, సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. రాహుల్‌ గాంధీ, ఎ.రేవంత్‌ రెడ్డి (కాంగ్రెస్‌), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కార్ఫరెన్స్‌), కనిమొళి (డీఎంకే), ఈటి మహ్మద్‌ బషీర్‌ (ఐయుఎంఎల్‌), మిథున్‌ రెడ్డి (వైసీపీ), నామా నాగేశ్వరరావు (బీఆర్‌ఎస్‌), కె.సుబ్బరాయన్‌ (సీపీఐ), రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (జేడీయూ), కకోలి ఘోష్‌ (టీఎంసీ), హర్‌సిమ్రత్‌ కౌర్‌ (ఎస్‌ఏడీ), కేంద్ర మంత్రులు అమిత్‌ షా, స్మృతి ఇరానీ, రామ్‌ క్రిపాల్‌ యాదవ్‌, హీనా గావిట్‌ (బీజేపీ), అనుప్రియ పటిల్‌ (అప్నాదళ్‌) తదితరులు మాట్లాడారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా 2;03 గంటల పాటు మాట్లాడారు.

Spread the love