ముస్లిం వ్యాపారాలపై నిషేధం

– హర్యానాలో 50 పంచాయతీలు కీలక నిర్ణయం
చండీగఢ్‌: బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో ముస్లిం వ్యాపారుల ప్రవేశంపై పంచాయతీలు నిషేధం విధించాయి. అలాగే గ్రామాల్లో నివసించే ముస్లింలు వారి పత్రాలను పోలీసులకు సమర్పించాలని పేర్కొ న్నాయి. ఈ మేరకు సర్పంచులు సంతకం చేసిన లేఖలను
ముస్లిం వ్యాపారాలపై నిషేధం విడుదల చేశారు. హర్యానాలోని 50 పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఘర్షణలు జరిగాయి. ఇద్దరు హౌంగార్డులతో సహా ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో నూహ్ జిల్లాకు పొరుగున్న ఉన్న రేవారి, మహేందర్‌గఢ్‌, ఝజ్జర్‌ జిల్లాలకు చెందిన పంచాయతీలు ఒకే విధమైన లేఖలు విడుదల చేశాయి.
మరోవైపు, హిస్సార్‌ జిల్లాకు చెందిన కొంతమంది పంచాయతీ సభ్యులు కూడా ఇలాంటి డిమాండ్లు చేశారు. ముస్లిం ఉద్యోగులను తొలగించాలంటూ అన్ని షాపులకు రెండు రోజులు గడువు ఇచ్చారు. అలా చేయని షాపులు, వ్యక్తులను తాము బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ లేఖలు జారీ చేసిన పంచాయతీలకు షోకాజ్‌ నోటీసులు పంపాలని బ్లాక్‌ కార్యాలయాలను నార్నాల్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించారు.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, పల్వాల్‌, రేవారి, పానిపట్‌, భివానీ వంటి ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించి 142 కేసులు నమోదయ్యాయి. అల్లర్లకు సంబంధించి పోలీసులు 312 మందిని అరెస్ట్‌ చేశారు. 106 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love