మణిపూర్‌ సీఎంను మార్చాల్సిన అవసరం లేదు

 There is no need to change Manipur CM– బీరెన్‌కు అమిత్‌షా సమర్థన
మణిపూర్‌లో హింసను అరికట్టడంలో పూర్తిగా విఫలం అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా సమర్థించారు. బుధవారంలోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదనిహింసను విస్మరించాలని మెయిటీ, కుకీ రెండు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. 150 మందికి పైగా మరణించిన జాతి కలహాలు చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని అన్నారు. మణిపూర్‌ సంఘటన ”అవమానకరం”. కాగా దానిపై రాజకీయాలు ”మరింత సిగ్గుచేటు” అని అన్నారు.
అవిశ్వాసానికి ఆస్కారమే లేదు..
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఒక్క సరైన అంశం కూడా లేదని ఇంతవరకూ జరిగిన చర్చతో రుజువైందన్నారు. ప్రధానిపై, కానీ ప్రభుత్వంపై కానీ అసలు అవిశ్వాసమన్నదే లేదని, లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ఒక భ్రమను సృ ష్టించేందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చారని విమర్శించారు. దేశ ప్రజలకు, పార్లమెంట్‌కు నరేంద్ర మోడీపై పరిపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
మోడీ చారిత్రక నిర్ణయాలు..
మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందని, ఆనువంశక పాలన, లంచాల సంస్కృతికి చరమగీతం పాడిందని అమిత్‌ షా అన్నారు. అధికారం కాపాడుకోవడం కోసం యూపీఏ పాకులాడితే, సిద్ధాంతాల పరిరక్షణ కోసం ఎన్డీఏ పోరాడుతోందని చెప్పారు. గతంలో రాజీవ్‌ గాంధీ కేంద్రం నుంచి రూ.1 పంపితే…పేదలకు రూ.15 పైసలే చేరుతున్నాయని అన్నారని, కానీ ఇవాళ కేంద్రం నుంచి ప్రతి పైసా పేదలకు వెళ్తోందని అన్నారు. తాము కాశ్మీర్‌ యువత గురించి మాట్లాడతామే కానీ, జమాతే, పాకిస్థాన్‌ గురించి మాట్లాడమని అన్నారు. ఒక దశలో అమిత్‌ షా ప్రసంగానికి ప్రతిపక్షాలు అడ్డుపడటంతో ఆయన ఘాటుగా స్పందించారు. ”మీ పార్టీ మిమ్మల్ని ఎలాగూ మాట్లాడనీయదు, నా ప్రసంగాన్ని మీరెందుకు అడ్డుకుంటారు. కూర్చోండి” అన్నారు. దీంతో అధికార పార్టీ సభ్యుల బల్లలు చరుస్తూ నవ్వులు చిందించారు.
‘అవినీతికి ప్రతిరూపం ఇండియా కూటమి’
  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లా డుతూ అవినీతి, వారసత్వ రాజకీయాలు దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. ”మీది ఇండియా కాదు, అవినీతికి ప్రతిరూపం” అని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు. మణిపూర్‌ విడిపోలేదన్నారు. మణిపూర్‌ దేశంలో అంతర్భాగమన్నారు. దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్రగల కాంగ్రెస్‌ దేశాన్ని హత్య చేసినట్టు చెప్పడంలో అర్థం లేదన్నారు. దేశం పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్‌ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మణిపూర్‌ను ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేరని స్పష్టం చేశారు.

Spread the love