సంస్కారంతో కూడిన విద్య అవసరం

– డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి
– పోషకుల అవగాహన సదస్సు
నవతెలంగాణ జమ్మికుంట : విద్యార్థులకు సంస్కారంతో కూడిన విద్య అవసరమని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోనిశ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో విద్యావిషయక ప్రదర్శన , పోషకుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేసి మాట్లాడారు.విద్యార్థులలో సంస్కారాలు నింపుటలో ఉపాధ్యాయులతో పాటు పోషకుల బాధ్యత  ఉంటుందని అన్నారు. సంస్కారంతో కూడిన విద్యా శశి మందిర్లో దొరుకుతుందన్నారు. అనంతరం చిన్నారులు అలరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జమ్మికుంట ,హుజరాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్  , సురక్ష ఆసుపత్రి యజమాని డాక్టర్ కన్నెబోయిన తిరుపతి , పాఠశాల సమితి ప్రబంఅందకరిణి అధ్యక్ష, కార్యదర్శులు ఆవాల రాజిరెడ్డి ,  శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్ , గుండా తిరుపతయ్య, పాఠశాల ప్రధానాచార్యులు  గుడికందుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love