డిఫరెంట్‌ కాన్సెప్ట్‌

Blood and chocolate డైరెక్టర్‌ శంకర్‌ ప్రొడక్షన్స్‌ ఎస్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’. వసంతబాలన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్‌ దాస్‌ హీరోగా, దుసరా విజయన్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌డి.ఎస్‌ సంస్థ విడుదల చేయనుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. డైరెక్టర్‌ వసంత బాలన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’ అంటే ప్రేమ, అభిమానం. మంచి ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. అర్జున్‌ దాస్‌ రోల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యాంగ్రీ యంగ్‌ మేన్‌గా అన్నీ ఎలిమెంట్స్‌ను ఆయన అద్భుతంగా పండించారు. ఈ మూవీలో జీవీ ప్రకాష్‌కుమార్‌ నాలుగు పాటలకు సంగీతాన్ని అందించారు’ అని అన్నారు.
‘ఈ సినిమాను మా ఎస్‌.ఆర్‌.డి.ఎస్‌ బ్యానర్‌లో రిలీజ్‌ చేయడాన్ని చాలా సంతోషంగా ఫీల్‌ అవుతున్నాం’ అని నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి చెప్పారు. హీరో అర్జున్‌ దాస్‌ మాట్లాడుతూ, ”నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న వసంత బాలన్‌తో కలిసి పని చేయటం మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌’ అని తెలిపారు. ‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా’ అని దుస్సారా విజయన్‌ చెప్పారు.

Spread the love