బర్త్‌డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా

As a birthday gift Double bang for the fansచిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి కార్యక్రమాలు చేస్తూ బర్త్‌డేని జరుపుకునే అభిమానులకు ఇదొక పండగ లాంటి రోజు. ఈ పండగ రోజు తన అభిమానులను మరింత ఖుషీ చేయడానికి బర్త్‌డే గిఫ్ట్‌గా మెగాస్టార్‌ నటించబోయే సినిమాల అనౌన్స్‌మెంట్స్‌ని మేకర్స్‌ చేశారు.
తనయ సుస్మిత నిర్మాణంలో 156వ సినిమా
చిరంజీవి నటించబోయే ఆయన 156వ చిత్రాన్ని ఆయన తనయ సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’వ చిత్రం నుండి ఆమె చిరుకి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఆమె నిర్మించనున్నారు. త్వరలోనే చిత్ర దర్శకుడిని అనౌన్స్‌ చేస్తారు.
చిరు బర్త్‌డే నేపథ్యంలో ”నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ. భావోద్వేగాలను కలిగించే అపారమైన వ్యక్తిత్వం. తెరపైన, బయట పండగ లాంటి వ్యక్తి. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు మెగా156 మెగారాకింగ్‌ ఎంటర్టైనర్‌ అవుతుంది. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ప్రొడక్షన్‌ హౌస్‌ ట్వీట్‌ చేసింది.
బింబిసార దర్శకుడితో 157వ చిత్రం
చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్‌ చేశారు. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించ నున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి వంశీకష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న మెగా157 చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్‌ ఎక్స్‌పెన్సీవ్‌ చిత్రంగా ఉండనుంది. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్‌, త్రిశూలంతో ఉన్నాయి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫాంటసీ మూవీ తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Spread the love