ఆయిల్ ఫాం రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి

– ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలక్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట :
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయిల్ ఫాం రైతులు సాగులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ సూచించారు.ముఖ్యంగా నీటి తడులు ను తరుచూ అందించాలని చెప్పారు.ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆయిల్ ఫాం లేత, ముదురు తోటల్లో నీటి యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో దిగుబడులు పై ఎక్కువ ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. లేత తోటల్లో రోజుకు 150 నుండి 185 లీటర్లు, ముదురు తోటలకు 250 నుండి 300 లీటర్ల నీరు తప్పనిసరిగా అందించేలా తగు ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు.నీటి తడులు అందించటం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని, అంతర పంటలకు కూడా తగు సాగునీరు అందేలా జాగ్రత్త పడాలని చెప్పారు. సిఫార్సులకు అనుగుణంగా పోషకాలు అందించాలని, అవసరమైతే క్షేత్ర సిబ్బంది సూచనలు,సలహాలు పాటించాలని కోరారు.తోటలకు సాగునీరు సరఫరాలో ఎటువంటి అశ్రద్ద ఉండొద్దని స్పష్టం చేశారు.
Spread the love