Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్20న డాక్టర్ చిలుకు స్వామికి సన్మాన కార్యక్రమం

20న డాక్టర్ చిలుకు స్వామికి సన్మాన కార్యక్రమం

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 
ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్ చిలుకు స్వామికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక “శ్రమ శక్తి అవార్డు” లభించిన సందర్భంగా ఈ నెల 20న ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు ఆలేరు జీడికల్ హైవే రోడ్డులోని కొల్లూరు వద్ద ఉన్న కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జరగనుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఆలేరు ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచందర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ చిలుకు స్వామిని ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తలు, అన్ని మండలాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, యువజన, మహిళ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, రైతు సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.అదేవిధంగా శారాజీపేట గ్రామ ప్రజలు,అభిమానులు,మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.డాక్టర్ చిలుకు స్వామికి లభించిన శ్రమ శక్తి అవార్డు ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -