రెప రెపలాడిన జాతీయ జెండా

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామ తండాలో ప్రభుత్వ కార్యాలయంలో తో పాటు పాఠశాలలో రాజకీయ పార్టీల కార్యాలయంలో స్వతంత్ర  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ తిర్మల్ రెడ్డి జెండా ను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కోన రెడ్డి.మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి తహశీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ దశరథ్ ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండాను ఆవిష్కరణ చేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.మాండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల అధికారి గైర్హాజరు కావడంతో స్థాయిని ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్వతంత్ర వేడుక రోజు కూడా.వ్యవసాయ శాఖ అధికారి నదీమ్ ఉద్దీన్ హాజరుకాకపోవడం ఏంటాని అక్కడే ఉన్న వ్యవసాయ శాఖ ఏఈఓ ను ప్రశ్నించారు. దింతో ఆమె ఈ రోజు సెలవుల్లో ఉన్నారని సమాధానం ఇచ్చారు.దింతో ప్రజా ప్రతినిధులు తీవ్ర విమర్శలు చేయడం తో పాటు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,ఎంపీడీఓ రాణీ, తహసీల్దార్ దశరథ్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love