మండలంలోని వడ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలాలోవిధులు నిర్వహించిఇటీవలబదిలీపై వెళ్లిన రామాంజనేయులు, శివ ప్రసాద్,గంగామణి ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.అనంతరంవారుమాట్లాడుతూ రామాంజనేయులుగత కొన్ని సంవత్సరాలుగా ఈ పాటశాలల్లోపనిచేసిబదిలీపై వెళ్తునందుకు బాధాకరమైనప్పటికీ ఉద్యోగ రీత్యా బదలిలో వెళ్లడం సర్వసాధనం అన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ వడ్లం పాఠశాలకు వచ్చి నుండి మా పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఎక్కడైనా చేసేది ఉద్యోగమే కానీ వడ్లం పాఠశాలతో విడదీయని బంధం ఏర్పడిందని ఇక్కడ నా తోటి పని చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి మండలంలోని మంచి గుర్తింపు తెచ్చుకున్న పాఠశాలగా వడ్లం పాఠశాలను తీర్చిదిద్దామని అన్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు చెప్పినట్లు విధి విద్య బోధనలు పాటిస్తూ మీ తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోరావాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వల్లబరావు, సంగమేశ్వర్, శ్రీరామ్, ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.