ఘనంగా ఇంజనీరింగ్ డే

A grand engineering day– పాలిటెక్నిక్ విశ్వేశ్వరయ్యకు నివాళులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ డే ను ఘనంగా ఆదివారం నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందు, గౌరవ అతిథిగా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి హాజరై విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ బి నరేశ్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పి. బాలనరసింహులు, ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కాలేజీ టాపర్లను గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, మెమెంటోతో సత్కరించారు. అలాగే బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో టాపర్లకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం అందజేసి సన్మానించారు.
Spread the love