నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్‌లో 92-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. దాదాపుగా 26సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలిసి ఈ సమ్మేళనంలో పాల్గొని వివిధ హోదాల్లో పనిచేస్తున్న అలనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. చదువుకున్న బడిలో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఇట్లాంటి సమ్మేళనం ద్వారా విద్యార్థి దశలో దూరమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాదరావు లక్ష్మీనారాయణ, విద్యార్థులు మౌలానా, భూపతిరెడ్డి, నాగిరెడ్డి, సాగర్‌రెడ్డి, చిలుకూరు ఎంపీపీ ప్రశాంతి, అంజమ్మ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.