ఆమనగల్‌ లయన్స్‌ క్లబ్‌కు అవార్డుల పంట

– రీజయన్‌లోనే ఉత్తమ క్లబ్‌గా ఎంపిక
నవతెలంగాణ-ఆమనగల్‌
లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆమనగల్‌కు అవార్డుల పంట పండింది. క్లబ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలతో రీజియన్‌ పరిధిలోనే ఉత్తమ క్లబ్‌గా ఎంపికయ్యింది. ఈ మేరకు హైదరాబాద్‌ కర్మన్‌ ఘాట్‌లోని ఏపీఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన మల్టిపుల్‌ 320 గీతాంజలి రీజియన్‌-3వ సమావేశంలో రీజియన్‌ చైర్‌పర్సన్‌ సాధు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లబ్‌ సభ్యులు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ క్లబ్‌గా ఎంపిక అవడంతో పాటు ఉత్తమ్మ అధ్యక్షులుగా యాచారం వెంకటేశ్వర్లుగౌడ్‌, ఉత్తమ కార్యదర్శిగా కె.గోవర్ధన్‌ రెడ్డి, ఉత్తమ కోశాధికారిగా కొరివి వెంకటయ్య, ఉత్తమ పీఆర్‌ఓగా ఎం. ఏ. పాషా అవార్డులు అందు కున్నారు. అదేవిధంగా క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలకు గాను మొత్తం 10 అవార్డులు లభించినట్టు పాషా తెలిపారు. ఈ కార్య క్రమంలో సీనియర్‌ క్లబ్‌ నేతలు నరేందర్‌ రెడ్డి, హరినారాయణ బటడ్‌, కోటేశ్వరరావు, మహేందర్‌ కుమార్‌రెడ్డి, చెన్నకిషన్‌ రెడ్డి, దామోదర్‌రెడ్డి, డీసీ సీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, రఘు, అంజయ్య, ఓంకారం, అంజయ్య, మనోహర్‌, గుర్రం కేశవులు, బావండ్ల వెంకటేష్‌ పాల్గొన్నారు.

Spread the love